భూకంపం అనుకున్నారు.. కానీ..?
- April 30, 2018నిన్న రాత్రి పది, పదకొండు సమయంలో టర్కీ, లెబనాన్‌లలోని కొన్ని ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 2.6గా నమోదైంది.. ఇంట్లోని సామానులు, ఫర్నిచర్‌లో కదలికలు రావడంతో.. ప్రజలు ప్రాణభయంతో ఇళ్లలోంచి రోడ్ల మీదకు పరుగులు తీశారు. వెంటనే రంగంలోకి దిగిన భూకంప పరిశోధన కేంద్రం.. భూకంప కేంద్రాన్ని గుర్తించేపనిలో పడగా అసలు నిజం తెలిసింది. ఇది ప్రకృతిపరంగా సంభవించిన భూకంపం కాదని తేలింది. సరిగ్గా ఇదే సమయంలో ఇజ్రాయిల్ సైన్యం సిరియాపై భీకర వైమానిక దాడులు చేసింది. దక్షిణ హమాలోని 47వ మిలిటరీ బ్రిగేడ్ కాంపౌండ్ పై అత్యంత శక్తివంతమైన క్షిపణులతో దాడి చేయడంతో.. తీవ్రస్థాయిలో ప్రకంపనలు సంభవించాయి.. దీని ప్రభావంతో సిరియా సరిహద్దున ఉన్న టర్కీ, లెబనాన్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో భూకంపం చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- కాన్సస్‌లో దిగ్విజయంగా NATS బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- తెలంగాణకు భారీ ఒప్పందం
- డిపోల ప్రైవేటీకరణ దుష్ప్రచారాన్ని ఖండించిన TGSRTC
- మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం...11 మంది మృతి
- తిరుపతి తొక్కిసలాట పై న్యాయ విచారణకు ఆదేశం
- ఘనంగా ముగిసిన రాచకొండ కమిషనరేట్ ఆరవ ఎడిషన్ వార్షిక స్పోర్ట్స్ మీట్-2025
- బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు
- శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రెడ్ అలర్ట్..
- కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం.. అవగాహన ప్రచారాలను ముమ్మరం..!!