నైజీరియాలో ఆత్మాహుతి దాడులు.. 27 మంది దుర్మరణం
maagulf
maagulf
maagulf
maagulf
maagulf
maagulf
maagulf
నైజీరియాలో ఆత్మాహుతి దాడులు.. 27 మంది దుర్మరణం

నైజీరియాలో ఆత్మాహుతి దాడులు.. 27 మంది దుర్మరణం

నైజీరియాలోని ముబి పట్టణంలో రెండు ఆత్మాహుతి దాడులు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు తమను తాము పేల్చేసుకున్నారు. ఈ ఘటనల్లో 27 మంది అక్కడికక్కడే మృతి చెందగా 56 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొదటి ఆత్మాహుతి మసీదు లోపల జరిగిందని, మరో దాడి అదే మసీదుకు సమీపంలో దుస్తుల మార్కెట్‌ బయట జరిగిందని అడమావా రాష్ట్ర సమాచార కమిషనర్‌ అహ్మద్‌ సాజో పేర్కొన్నారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేస్తున్నామని స్థానిక అధికారి వెల్లడించారు.