ప్రపంచ కాలుష్య నగరాల్లో ముంబయికి 4వ స్థానం

ప్రపంచ కాలుష్య నగరాల్లో ముంబయికి 4వ స్థానం

ప్రపంచ కాలుష్య నగరాల జాబితాలో దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరం చేరింది. ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది కైరో, ఢాకా, బీజింగ్‌ నగరాలు కాలుష్య నగరాలుగా నిలిచాయి. ముంబయిలో ప్రతి పది మందిలో 9 మంది కలుషిత వాయువును పీలుస్తున్నారని గ్లోబల్ ఎయిర్ పొల్యూషన్ డేటాబేస్ వెల్లడించింది. చంద్రాపూర్, నాగ్ పూర్, నవీ ముంబయి, పూణే, షోలాపూర్ నగరాల్లో కూడా కాలుష్యం పెరిగిందని తాజా గణాంకాలు తేటతెల్లం చేశాయి. కలుషిత వాయువులను నిరోధించకుంటే ఊపిరితిత్తుల వ్యాధులు, లంగ్ కేన్సర్ లాంటి వ్యాధుల ముప్పు పెరిగే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Back to Top