పెళ్ళికి ముస్తాబవుతున్న సోనమ్ ఇల్లు
May 01, 2018మ్యారేజ్‌కి సమయం దగ్గరపడుతుండడంతో అధికారికంగా ప్రకటన చేసింది సోనమ్‌కపూర్ ఫ్యామిలీ. తన ఫ్రెండ్, బిజినెస్‌మేన్ ఆనంద్ ఆహుజాను ఈనెల 8న మ్యారేజ్ చేసుకోనుంది సోనమ్‌కపూర్. ఈ వేడుక ముంబైలో గ్రాండ్‌గా జరగనుంది. కొన్నాళ్లుగా సోనమ్- ఆనంద్‌ల పెళ్లి గురించి వార్తలు జోరందుకున్నా ఇరు ఫ్యామిలీలు కనీసం నోరు కూడా మెదపలేదు. ఐతే, మంగళవారం కపూర్- ఆహుజా ఫ్యామిలీలు విడుదల చేసిన ప్రకటనతో వీళ్ల పెళ్లి ఓకే అయ్యింది.
ఈ వివాహం గురించి ప్రకటిస్తున్నందుకు కపూర్- ఆహుజాల కుటుంబాలు ఎంతో హ్యాపీగా ఉన్నాయని, ఇది అత్యంత సన్నిహితుల మధ్య జరిగే వేడుక అని, మా కుటుంబాల అంతర్గత వ్యవహారాలను గౌరవిస్తారని కోరుకుంటున్నాని అందులో ప్రస్తావించాయి. మరోవైపు మ్యారేజ్‌కి సమయం దగ్గరపడుతుండడంతో సందడి నెలకొంది. ఇప్పటికే సోనమ్ ఇంటిని అందంగా డెకరేట్ చేశారు. అందుకు సంబంధించి ఫిక్స్.