దుబాయ్:రమదాన్‌లో స్కూల్ టైమింగ్స్
- May 02, 2018
దుబాయ్:పవిత్ర రమదాన్ మాసంలో విద్యార్థుల స్కూల్ టైమింగ్స్‌ని మార్చడం ఆనవాయితీగా వస్తోంది. తక్కువ సమయం మాత్రమే స్కూల్స్ ఈ సీజన్‌లో నడుస్తాయి. దుబాయ్స్ నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కెహెచ్‌డిఎ) ఈ మేరకు సర్కులర్‌ని జారీ చేసింది. ఉదయం 8 నుంచి 8.30 నిమిషాల మధ్య స్కూల్స్ & రపారంభమవుతాయి. మధ్యాహ్నం 1 గంట - 1.30 వరకు మాత్రమే స్కూల్స్ పనిచేస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూల్ టైమింగ్స్ 5 గంటలకు మించి వుండకూడదు. కెహెచ్‌డిఎ చీఫ్ ఆఫ్ రెగ్యులేషన్స్ అండ్ పిర్మట్స్ కమిషన్ మొహమ్మద్ దార్విష్ మాట్లాడుతూ, యూఏఈ మరియు దుబాయ్ వాసులకు ఈ పవిత్ర రమదాన్ మాసం ఎంతో ప్రత్యేకమైనది చెప్పారు. చిన్నారులు, యువత భవిష్యత్ నిర్దేశకులు గనుక, వారికి ఈ పవిత్ర రమదాన్ మాసం పట్ల అవగాహన పెంచడం, ఆధ్యాత్మిక వాతావరణాన్ని వారికి అలవాటు చేయడంలో భాగంగా పలు కార్యక్రమాల్ని రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా