ఫేస్ బుక్ యూజర్లకు శుభవార్త...
May 02, 2018
యూజర్లకు ఫేస్ బుక్ యాజమాన్యం శుభవార్త అందించింది. ఇప్పటికే డేటా చోరీ ఆరోపణలు ఎదుర్కుంటున్న ఫేస్ బుక్ ఇకపై యూజర్ల సమాచారంపై దృష్టి పెట్టనుంది. అందుకోసం త్వరలో ఓ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు పేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ చెప్పారు. ఈ ఫీచర్ పేస్ బుక్ లో చూసిన వెబ్ సైట్లు, యాప్స్ సమాచారాన్ని అకౌంట్ నుంచి డిలీట్ చేసుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. బ్రౌజర్ లో కుకీస్ క్లియర్ కూడా చేసుకోవచ్చని మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించాడు. ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రయోగ దశలో ఉంది అతికొద్ది రోజుల్లోనే యూజర్లకు అందుబాటులోకి రానుంది.