రస్‌ అల్‌ ఖైమా:నిద్రిస్తున్న మహిళపై అత్యాచారయత్నం: నిందితుడికి జైలు

రస్‌ అల్‌ ఖైమా:నిద్రిస్తున్న మహిళపై అత్యాచారయత్నం: నిందితుడికి జైలు

రస్‌ అల్‌ ఖైమా:రస్‌ అల్‌ ఖైమా క్రిమినల్‌ కోర్టు ఓ అరబ్‌ రెసిడెంట్‌కి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. ఆసియన్‌ మహిళ ఒకరిపై అత్యాచార యత్నం చేసినట్లు నిందితుడిపై అభియోగాలు నిరూపించబడ్డాయి. బాధితురాలి నివాసంలో నిందితుడు ఈ అఘాయిత్యానికి యత్నించాడు. నిందితుడి చర్య పట్ల అప్రమత్తమైన బాధితురాలు, నిందితుడ్ని ధైర్యంగా ఎదుర్కొంది. బాధితురాలు రస్‌ అల్‌ ఖైమా పోలీసులకు పిర్యాదు చేయగా, విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. తన ఇంటి పక్కనే వున్న మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మాట వాస్తవమేననీ, అయితే ఆమె తనను కవ్వించేదని నిందితుడు వాదించినా, న్యాయస్థానం ఆ వాదనల్ని కొట్టి పారేసింది.

Back to Top