డోనాల్డ్ ట్రంప్ రహస్య పర్యటన
- January 04, 2019టెహ్రాన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాగ్దాద్‌లో ఇటీవల జరిపిన రహస్య పర్యటన ఇరాక్‌లో అమెరికా ఓటమికి ఒక తిరు గులేని తార్కాణమని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ బుధవారం వ్యాఖ్యా నించారు. ఇరాక్‌పై దురాక్రమణకు యత్నించిన అమెరికా దారుణంగా భంగపడిందని ఆయన చెప్పారు. మంత్రి వర్గ సమావేశంలో సిరియా, ఆఫ్ఘనిస్తాన్ల నుంచి అమెరికా సేనల ఉపసంహ రణ గురించి ట్రంప్ ఇటీవల చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ అత్యంత రహస్యంగా బాగ్దాద్‌కు రావడం, వచ్చాక కూడా సైనిక స్థావరాన్ని దాటి ఒక్క అడుగు కూడా బయటకు వెళ్లకపోవడం ఇవన్నీ ఇరాక్‌లో అమె రికా ఓటమిని తెలియజేస్తున్నా యని రౌహాని చెప్పారు. ఇరాక్‌పై యుద్ధంలో అమెరికా విజ యం సాధించలేదు. అమెరికా గురించి ఇరాక్ ప్రజలకు బాగా తెలుసు, అగ్ర రాజ్యాన్ని వారు ఎంతమాత్రమూ విశ్వసించడం లేదు. అమెరికా తీరుపై ఎంత మాత్రమూ సంతృప్తికరంగా లేరు. అమెరికా సేనలపై వారు తిరగబడుతున్నారని రౌహాని తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన
- కువైట్ లో వర్క్ పర్మిట్ జారీకి కీలక ప్రతిపాదనలు..!
- భారత ప్రయాణికులకు శుభవార్త..!
- దుబాయ్ లో కొత్తగా 30 పార్కుల నిర్మాణం..!
- 20 అవినీతి కేసులపై నజాహా దర్యాప్తు
- విద్యార్థుల కోసం 4 రెసిడెన్సీ వీసాలు..ఖర్చు, ప్రక్రియ
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా