బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన
- May 08, 2024
మనామా: సైన్స్, గణిత విషయాలలో దశలవారీగా ఆంగ్ల పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని విద్యా మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని విద్యా మంత్రిత్వ శాఖ మంత్రి డాక్టర్ మహమ్మద్ బిన్ ముబారక్ జుమా ధృవీకరించారు. నాలెడ్జ్ సముపార్జనలో, ముఖ్యంగా సాంకేతిక రంగంలో ఆంగ్ల భాషా పటిమ ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని తెలియజేశారు. బహ్రెయిన్‌లోని ప్రభుత్వ పాఠశాల పాఠ్యాంశాల్లో ఆంగ్లభాషను చేర్చాలని, అలాగే ఈ విద్యా అంతరాన్ని తగ్గించడానికి మెరుగైన బోధనా విధానం పెట్టనున్నట్లు తెలిపారు. అదే విధంగా బోధకుల అభివృద్ధి కోసం ప్రత్యే కార్యాచరణ తీసుకోబోతున్నట్లు ఎంపీ మరియం అల్-సాగ్ సంధించిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి చెప్పారు. మంత్రిత్వ శాఖ భాషా నైపుణ్యం కోసం ఒక కోర్సును రూపొందించిందన్నారు. బహ్రెయిన్‌లోని యువకులకు ఇంగ్లిష్ భాషలో పట్టును పెంచేందుకు TOEFL మరియు IELTS కోసం సన్నాహక కోర్సులను ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







