జహ్రాలో ఈవ్‌ టీజర్స్‌ అరెస్ట్‌

జహ్రాలో ఈవ్‌ టీజర్స్‌ అరెస్ట్‌

కువైట్‌ సిటీ: జహ్రా పోలీస్‌, ముగ్గురు యువకుల్ని ఈవ్‌టీజింగ్‌ కేసులో అరెస్ట్‌ చేశారు. మహిళా పాదచారులపై నిందితులు ఈవ్‌ టీజింగ్‌కి పాల్పడుతున్నట్లు పోలీసులు ఆరోపించారు. జహ్రాలోని నయీమ్‌ వద్ద వీరి ఆగడాలు ఎక్కువయ్యాయని అధికారులు తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్స్‌ ఆపరేషన్‌ రూమ్‌కి ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. అరెస్టయిన నిందితులు డ్రగ్స్‌కి బానిసలని, అందులో ఒకరు పోలీసుల లిస్ట్‌లో వాంటెడ్‌గా వున్నారనీ, అధికారులు వివరించారు. 

 

Back to Top