'దర్బార్'పోస్టర్ విడుదల
- July 28, 2019ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం 'దర్బార్'. ఈ సినిమాపై దక్షిణాది పరిశ్రమలో భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇందులో తలైవర్ పోలీసు అధికారిగా నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమా ఆరంభం నుంచే చిత్రానికి సంబంధించి ఫొటోలు లీకవుతూనే ఉన్నాయి. మరోవైపు తాజాగా రెండు ఫొటోలను దర్శకుడు మురుగదాస్ విడుదల చేశారు. వాటిని ఉపయోగించి పోస్టర్‌ను డిజైన్ చేసి తమకు పంపితే అందులో మంచి డిజైన్ ఎంపిక చేసి అధికారికంగా విడుదల చేస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది. దీంతో అభిమానులందరూ తమ ప్రతిభకు పదును పెడుతున్నారు. ఇప్పటికే ట్విట్టర్లో వందల డిజైన్లు కనిపిస్తున్నాయి. ఆ రెండు ఫొటోలతో చిత్ర బృందానికే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ పలు రకాలుగా పోస్టర్లను రూపొందిస్తున్నారు అభిమానులు. కొన్ని డిజైనింగ్ సంస్థలు కూడా బరిలోకి దిగడం ఆశ్చర్యకరం. మొత్తానికి ఈ పోస్టర్ డిజైనింగ్‌తో అభిమానుల్లో సందడి నెలకొంది. త్వరలోనే ఓ మంచి పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన
- కువైట్ లో వర్క్ పర్మిట్ జారీకి కీలక ప్రతిపాదనలు..!
- భారత ప్రయాణికులకు శుభవార్త..!
- దుబాయ్ లో కొత్తగా 30 పార్కుల నిర్మాణం..!
- 20 అవినీతి కేసులపై నజాహా దర్యాప్తు
- విద్యార్థుల కోసం 4 రెసిడెన్సీ వీసాలు..ఖర్చు, ప్రక్రియ
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా