బోనాల సంబరాలతో వెలిగిపోతోన్న హైదరాబాద్
- July 28, 2019
హైదరాబాద్:బోనాల సంబరాలతో భాగ్యనగరం వెలిగిపోతోంది.. పాతబస్తీ ఆధ్మాత్మికశోభను సంతరించుకుంది. లాల్ దర్వాజ బోనాల జాతర సందడిగా సాగుతోంది. సింహవాహినిగా వేంచేసిన మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించుకుంటున్నారు.. భక్తుల మొక్కులు, శివసత్తులు, పోతురాజుల విన్యాసాలతో పాతనగరం సందడిగా మారింది. మహిళా భక్తులు అమ్మవారికి బోనాలు, నైవేద్యం సమర్పించేందుకు బారులు తీరుతున్నారు. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివస్తున్నారు..
అక్కన్న, మాదన్న దేవాలయాలతోపాటు అన్ని చోట్ల ఘనంగా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి.. అటు రేపు రంగం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆ తర్వాత భవానీ రథయాత్ర జరుగుతుంది.. మరోవైపు మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టువస్త్రాలు సమర్పించారు.. ఓల్డ్ సిటీలో బోనాలకు జీహెచ్‌ఎంసీ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..