పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన...వివరాలు
- March 18, 2025
న్యూ ఢిల్లీ: ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లి యోజన దేశంలోని లక్షలాది కుటుంబాలకు ఉచిత సౌరశక్తిని అందిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద రూఫ్‌టాప్ సోలార్ చొరవగా పేరుగాంచిన ఈ పథకం ఇప్పటి వరకు 10 లక్షల ఇళ్లకు సోలార్ ఎనర్జీ అందించింది. కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ నాటికి ఈ సంఖ్యను 20 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2027 మార్చి నాటికి కోటి ఇళ్లకు సౌరశక్తిని సరఫరా చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీం ముందుకు సాగుతోంది.
ఈ పథకం ప్రయోజనాలు ఏంటి?
▪️గృహ యజమానులకు సౌర ఫలకాలను అమర్చుకోవడానికి 40% వరకు సబ్సిడీ.
▪️12 ప్రభుత్వ రంగ బ్యాంకులు 6.75% సబ్సిడీ వడ్డీ రేటుతో రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా రుణాలను అందిస్తున్నాయి.
▪️రూ. 78,000 వరకు సబ్సిడీ లభించనుంది.
▪️సంవత్సరానికి కేవలం 6.75% వడ్డీ రేటుతో రూ. 6 లక్షల వరకు రుణం తీసుకునే ఛాన్స్.
▪️రూ. 2 లక్షల వరకు రుణాలకు ఎలాంటి ఆదాయ పత్రాలు అవసరం లేదు.
▪️మొత్తం ఖర్చులో 90% వరకు బ్యాంకు ఫైనాన్స్ సదుపాయం.
అర్హత ప్రమాణాలు
▪️దరఖాస్తు దారుడు తప్పనిసరిగా భారతీయ పౌరుడై ఉండాలి.
▪️సౌర ఫలకాలను అమర్చడానికి అనువైన పైకప్పు గల ఇంటి యజమానిగా ఉండాలి.
▪️ఇంటికి చెల్లుబాటు అయ్యే విద్యుత్ కనెక్షన్ ఉండాలి.
▪️ఇంతకు ముందు ఎలాంటి ఇతర ప్రభుత్వ సబ్సిడీని పొందకూడదు.
ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లి యోజనకు దరఖాస్తు విధానం
▪️ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://pmsuryaghar.gov.in/ను సందర్శించండి.
▪️వినియోగదారుల ట్యాబ్‌లో "ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి" అనే ఆప్షన్‌ను ఎంచుకోండి (లేదా) "కన్స్యూమర్ లాగిన్" పై క్లిక్ చేయండి.
▪️మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, ఓటీపీ ద్వారా ధృవీకరించండి.
▪️మీ పేరు, రాష్ట్రం, ఇతర వ్యక్తిగత వివరాలను నమోదు చేసి, ఇమెయిల్ ఐడీ ధృవీకరించండి.
▪️మీరు అవసరమైతే విక్రేత ఎంపికకు "అవును" లేదా "కాదు" అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
▪️'సోలార్ రూఫ్‌టాప్ కోసం దరఖాస్తు చేసుకోండి' పై క్లిక్ చేసి, మీ రాష్ట్రం, జిల్లా డిస్కామ్ వంటి ఇతర వివరాలను నమోదు చేయండి.
▪️సాధ్యాసాధ్య అంగీకారాన్ని పొందిన తర్వాత, విక్రేతను ఎంపిక చేసుకుని మీ బ్యాంక్ వివరాలను సమర్పించండి.
▪️ఆపై మీ సబ్సిడీ మంజూరైన తర్వాత సోలార్ ప్లాంట్‌ను అమర్చుకోవచ్చు.
తాజా వార్తలు
- వాట్సాప్ కొత్త సెక్యూరిటీ ఫీచర్
- APL తొలి మ్యాచ్ కు ముఖ్య అతిథిగా రానున్న రామ్ చరణ్
- ట్రంప్ అధికారాలకు బ్రేక్: ఇరాన్‌తో యుద్ధాన్ని నిరోధిస్తూ చారిత్రాత్మక తీర్మానం
- చిన్నారి పై హత్యాచారం.. కాలు పై కాల్చి మృగాడిని పట్టుకున్న పోలీసులు
- నార్త్ అల్ బతినాలో 'మ్యాంగో ఎక్స్‌ట్రావాగంజా' ప్రారంభం..!!
- ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్.. గత సీజన్ రికార్డులు బ్రేక్..!!
- ఫీజులు లేవు.. దుబాయ్‌లో ఉచిత ఇండోర్ ఫిట్నెస్ ఏరియా గురించి తెలుసా?
- కువైట్ సైన్యం స్పెషల్ ఆపరేషన్..పేలుడు పదార్థాలు నిర్వీర్యం..!!
- సౌదీ అరేబియా పశ్చిమ తీరానికి డస్ట్ అలెర్ట్ జారీ..!!
- ICRF 'థర్స్ట్ క్వెంచర్స్ 2026' క్యాంపెయిన్ ప్రారంభం..!!







