మక్కాలో యెమెన్ వ్యక్తి, మహిళ అరెస్టు..!!
- March 18, 2025
మక్కా: మక్కాలో ఆరుగురు పిల్లలతో భిక్షాటన చేయిస్తున్న యెమెన్ వ్యక్తి, మహిళను అరెస్టు చేశారు. మానవ అక్రమ రవాణా నిరోధక చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినందుకు వారిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. మక్కా ప్రాంత పోలీసులు, జనరల్ డిపార్ట్‌మెంట్ ఫర్ కమ్యూనిటీ సెక్యూరిటీ, కంబాటింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్‌తో సమన్వయంతో యాచకులను పర్యవేక్షించడానికి, పట్టుకోవడానికి కొనసాగుతున్న భద్రతా ప్రచారంలో భాగంగా ఈ అరెస్టులు జరిగాయన్నారు.
యెమెన్ ప్రజలు తమకు చెందిన ఆరుగురు పిల్లలను బహిరంగ ప్రదేశాలు, రోడ్లలో భిక్షాటన కోసం దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించినట్లు మక్కా పోలీసులు తెలిపారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వేధింపులకు గురైన పిల్లలకు అవసరమైన మానవతా సేవలను అందించడానికి భద్రతా అధికారులు చర్యలు ప్రారంభించారు.
తాజా వార్తలు
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్‌లో వాహనాలు స్వాధీనం..!!
- ఫ్రెండ్ షిప్ కథను తెలిపే ఇండియన్ మానుమెంట్..!!
- ఖతార్ జాతీయ దినోత్సవం.. షురా కౌన్సిల్ చైర్మన్ అభినందనలు..!!
- హైదరాబాద్: మూడు కమిషనరేట్ల పోలీసుల సంయుక్త వ్యూహం
- సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు
- యూట్యూబ్‌లో ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు







