ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్..
- March 20, 2025
న్యూ ఢిల్లీ: యూపీఐ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త యూపీఐ రూల్స్ అమల్లోకి రానున్నాయి. మీరు గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి యాప్‌ల ద్వారా యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. మీరు యూపీఐకి లింక్ చేసిన మొబైల్ నంబర్లు ఎక్కువ కాలం యాక్టివ్‌గా లేకుంటే యూపీఐ పేమెంట్లు చేయలేరు.
అందుకే.. మీ పాత మొబైల్ నెంబర్లను లింక్ చేసిన మీ బ్యాంక్ అకౌంట్ల నుంచి వాటిని తొలగిస్తామని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది. మీ బ్యాంక్ అకౌంట్ ఇన్‌యాక్టివ్ మొబైల్ నంబర్‌కు లింక్ అయితే అది వెంటనే తొలగిస్తారు. లేదంటే.. యూపీఐ పేమెంట్లు చేసేందుకు ప్రయత్నించేటప్పుడు మీరు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు.
NPCI నిర్ణయం ఎందుకంటే?
సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో NPCI ఈ నిర్ణయం తీసుకుంది. ఇన్‌యాక్టివ్ మొబైల్ నంబర్లు బ్యాంకింగ్, యూపీఐ సిస్టమ్‌లో సాంకేతిక లోపాలను సృష్టించవచ్చని ఎన్పీసీఐ ఎత్తిచూపింది.టెలికాం ప్రొవైడర్లు ఈ నంబర్లను వేరొకరికి తిరిగి కేటాయించినట్లయితే.. అది మోసానికి దారితీస్తుంది.
ప్రభుత్వం పౌరుల భద్రత కోసం ఇలాంటి రిస్క్ నుంచి రక్షించేందుకు ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. యూపీఐ లావాదేవీల కోసం మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ మొబైల్ నంబర్‌ను లింక్ చేయడం చాలా ముఖ్యం.
పేమెంట్ల సమయంలో ఈ నంబర్ ఐడెంటిఫైయర్‌గా పనిచేస్తుంది. నగదు పంపాల్సిన వ్యక్తికి సురక్షితంగా చేరుతాయి. ఒక మొబైల్ నంబర్ ఇన్‌యాక్టివ్ ఉండి అది మరో వ్యక్తికి కేటాయిస్తే.. అప్పుడు పేమెంట్ ఫెయిల్యూర లేదా పేమెంట్ మరొకరికి చేరుతుంది.
మీరు ఏమి చేయాలంటే?
మీ బ్యాంక్ అకౌంటుకు లింక్ చేసిన మొబైల్ నంబర్ యాక్టివ్‌గా లేకున్నా లేదా కొంతకాలంగా రీఛార్జ్ చేయకపోయినా ఆ నంబర్ ఇప్పటికీ మీ పేరుతో యాక్టివ్‌గా ఉందో లేదో తెలుసుకోవచ్చు. మీ టెలికాం ప్రొవైడర్ (జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా BSNL వంటివి)తో చెక్ చేయడం చాలా ముఖ్యం.
మీరు వెంటనే సిమ్ యాక్టివేట్ చేయాలి లేదా కొత్త మొబైల్ నంబర్‌తో మీ బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేయాలి. మీ వివరాలను అప్డేట్గా ఉంచేందుకు ప్రతి వారం ఇన్‌యాక్టివ్ మొబైల్ నంబర్ల రికార్డులను సవరించాలని NPCI బ్యాంకులతో పాటు యూపీఐ అప్లికేషన్లను ఆదేశించింది. ఏప్రిల్ 1 నుంచి బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి ఏవైనా ఇన్‌యాక్టివ్ నంబర్లు ఉంటే ఆటోమాటిక్‌గా తొలగించనుంది.
తాజా వార్తలు
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్‌గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్‌తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ







