ఈద్ అల్ ఫితర్ సెలవులు.. ఎయిర్ పోర్ట్ అత్యంత రద్దీ తేదీలు వెల్లడి..!!

- March 20, 2025 , by Maagulf
ఈద్ అల్ ఫితర్ సెలవులు.. ఎయిర్ పోర్ట్ అత్యంత రద్దీ తేదీలు వెల్లడి..!!

యూఏఈ: ఈద్ అల్ ఫితర్ సెలవులకు ముందు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు దుబాయ్ నుండి బయలుదేరి వెళతారని ఎమిరేట్స్ వెల్లడించింది. టెర్మినల్ 3 ప్రవేశ ద్వారాల వద్ద రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది.  ప్రయాణికులు ముందుగానే సిద్ధమై రావాలని సూచించింది.  మార్చి 28, 29 తేదీలలో టెర్మినల్ 3లో అత్యంత రద్దీగా ఉంటుందని పేర్కొంది. అలాగే ఏప్రిల్ 5, 6 వ తేదీలలోనూ ప్రయాణికుల రద్దీ ఉంటుందని, దాదాపు 80వేల కంటే ఎక్కువ మంది ప్రయాణికులు సెలవుల సందర్భంగా విదేశాలకు వెళ్లడం, రావడం చేస్తారని తెలిపారు. 

ప్రయాణీకులు తమ విమాన ప్రయాణ సమయానికి 3 గంటల ముందు విమానాశ్రయానికి చేరుకోవాలని, బోర్డింగ్ సమయాలను గమనించాలని సూచించింది. ప్రయాణానికి ముందు రాత్రి విమానాశ్రయంలో కస్టమర్లు తమ లగేజీని ఉచితంగా డ్రాప్ చేయవచ్చని గుర్తుచేసింది. దాంతో నేరుగా ప్రాసెసింగ్ కోసం ఇమ్మిగ్రేషన్ లేదా స్మార్ట్ టన్నెల్‌కు నేరుగా వెళ్లడానికి అవకాశం ఉంటుందని తెలిపింది. ప్రయాణీకులు ఎమిరేట్స్ వెబ్‌సైట్, యాప్, సిటీ చెక్-ఇన్, కియోస్క్‌లు, మొబైల్ పోర్ట్‌లు,  హోమ్ చెక్-ఇన్ సేవల ద్వారా చెక్-ఇన్ చేయవచ్చని వెల్లడించింది. విమానాలు బయలుదేరే 20 నిమిషాల ముందు బోర్డింగ్ గేట్లు మూసివేయబడతాయని, విమానాలు షెడ్యూల్ ప్రకారం బయలుదేరేలా చూసుకోవడానికి చెక్-ఇన్,  గేట్ మూసివేత సమయాలను ఖచ్చితంగా పాటిస్తారని గుర్తుచేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com