'ఓం నమో వేంకటేశాయ'లో అనుష్క!
- July 05, 2016
అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. ఈ చిత్రంలో అనుష్క భక్తురాలి పాత్రలో నటిస్తున్నట్లు దర్శకేంద్రుడు సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. 'ఏ పాత్ర అయినా చేయగలిగే అద్భుతమైన నటులలో అనుష్క ఒకరు. అది అరుంధతి అయినా, బాహుబలి అయినా, రుద్రమదేవి అయినా.. తన పాత్రలకు తగ్గట్లు ఒదిగిపోతూ నటనతో అందరిని ఆశ్చర్య పరుస్తూనే ఉంది. ఎప్పటి నుంచో తనకి నా సినిమాలో తగిన పాత్ర వస్తే చేయాలని ఉంది. ఇన్నాళ్లకి 'ఓం నమో వేంకటేశాయ' ద్వారా అది జరిగింది. తన కెరీర్‌లో మొదటిసారి భక్తురాలి పాత్ర చేస్తుంది. ఆ రోల్‌లో తన అద్భుత నటన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది, కొత్తగా కన్పిస్తుంది. 'ఓం నమో వేంకటేశాయ'లో అనుష్క నాగార్జునకి జంటగా నటించడం లేదు'. అని రాఘవేంద్రరావు తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!







