‘షణ్ముఖ’ మూవీ రివ్యూ..
- March 21, 2025
ఆది సాయికుమార్, అవికా గోర్ జంటగా తెరకెక్కిన సినిమా ‘షణ్ముఖ’. సాప్‌బ్రో ప్రొడక్షన్స్ బ్యానర్ పై తులసి రామ్ సప్పని, షణ్ముగం సప్పని నిర్మాణంలో షణ్ముగం సప్పని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆదిత్య ఓం, చిరాగ్ జాని, షణ్ముగం సప్పని, కృష్ణుడు, అరియనా గ్లోరీ, పండు, మనోజ్ నందం, చిత్రం శ్రీను..పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు. షణ్ముఖ సినిమా నేడు మార్చ్ 21న థియేటర్స్ లోకి వచ్చింది.
కథ: విగాండా(చిరాగ్ జానీ)కి ఆరు ముఖాలతో వికృత రూపంలో ఉన్న కొడుకు(షణ్ముఖ) పుడతాడు. షణ్ముఖ దగ్గరికి ఎవరూ రారు, అతను ఎదిగే క్రమంలో తల్లి చనిపోతుంది. తన కొడుకు షణ్ముఖుడికి ఒక ముఖం తెచ్చి, దేవుడు షణ్ముఖుడి లాగా తేజస్సు తెప్పించాలని విగాండా క్షుద్రపూజలు, మంత్రాలు, మాయలు కొన్నేళ్లపాటు నేర్చుకుంటాడు.
కార్తీ వల్లభన్ ఓ పోలీసాఫీసర్. ఓ డ్రగ్ డీలర్(ఆదిత్య ఓం) తో గొడవలో కార్తీ తుపాకీ పట్టుకొని పారిపోతాడు డ్రగ్ డీలర్. పై ఆఫీసర్లు అతన్ని హెచ్చరించి గన్ తెచ్చుకోమంటారు. అదే సమయంలో కార్తీ మాజీ ప్రేయసి సారా మహేశ్వరి(అవికా గోర్) ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం పీజీలో ఓ అమ్మాయిల మిస్సింగ్ కేసుకు సంబంధించి ప్రాజెక్టు చేస్తుంది. ఆ ప్రాజెక్టు కోసం అనుకోకుండా కార్తీ దగ్గరికి వస్తుంది. కొంతమంది అమ్మాయిలు మిస్ అవుతున్నారు. అమ్మాయిలు మిస్ అయిన కొన్ని రోజులకే వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ సూసైడ్ చేసుకుంటున్నారు అని తాను చేసిన రీసెర్చ్ చూపించడంతో మొదట నో చెప్పినా తర్వాత కార్తీ ఆ కేసు డీల్ చేస్తాడు.
మరి మిస్ అయిన అమ్మాయిలు ఎవరు? వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు? కార్తీ – సారా మధ్య మళ్ళీ ప్రేమ చిగురిస్తుందా? షణ్ముఖని మాములు మనిషి చేయడానికి విగాండా చేసిన ప్రయత్నం ఏంటి? షణ్ముఖ మాములు మనిషి అయ్యాడా? కార్తీ గన్ తిరిగొస్తుందా? కార్తీ కేసుని చేధించాడా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
సినిమా: కొంతమంది అమ్మాయిలు కనపడకుండా పోవడం, వాళ్ళను పోలీస్ ఆఫీసర్ పట్టుకోవడం అనేది రెగ్యులర్ కథే. కాకపోతే దీనికి ఆరు తలలతో పుట్టిన షణ్ముఖుడి కథని లింక్ చేసి కాస్త ఆసక్తిగా నడిపించారు. ఫస్ట్ హాఫ్ లో ఆరు తలలతో షణ్ముఖుడు పుట్టడం, అతని గురించి, అతన్ని మంచిగా మార్చాలని తండ్రి చేసే పనులు, హీరో డ్రగ్స్ డీలర్స్ ని పట్టుకోవడం, హీరోయిన్ ఎంట్రీ, అమ్మాయిలు మిస్సింగ్ కేసుతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో ఆ అమ్మాయిల మిస్సింగ్ కేసుని హీరో ఎలా ఛేదించాడు అని ఆసక్తిగా నడుస్తుంది.
ఫస్ట్ హాఫ్ కాస్త సాగదీసినట్టు ఉంటుంది. హీరోయిన్ ఎంట్రీ ఇచ్చి కేసు నడిపించేవరకు అసలు కథ మొదలవ్వదు.హీరోయిన్ ఎంట్రీ ఇచ్చాక కథపై ఆసక్తి నెలకొంటుంది.సెకండ్ హాఫ్ లో కూడా కాస్త సాగదీయడంతో పాటు స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుల్లో కాస్త కన్ఫ్యూజ్ వస్తుంది.అక్కడక్కడా కొన్ని లాజిక్స్ మిస్ అయ్యారు అనిపిస్తుంది. హీరో – హీరోయిన్ లవ్ స్టోరీ ప్రజెంట్ లో బాగానే చూపించినా ఫ్లాష్ బ్యాక్ లో అంతగా వర్కౌట్ అవ్వలేదు. కానీ చివరి అరగంట మాత్రం ట్విస్ట్ లు రివీల్ చేస్తూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసారు. చివర్లో ఓ మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. చివర్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిపై వచ్చే AI సాంగ్ మాత్రం మెప్పిస్తుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్: ఆది సాయి కుమార్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో బాగానే మెప్పించారు. అవికా గోర్ క్యూట్ గా కనిపిస్తూనే జర్నలిస్ట్ పాత్రలో బాగా నటించింది. నెగిటివ్ షేడ్స్ లో చిరాగ్ జాని మెప్పిస్తాడు. డైరెక్టర్ కాంట్రాక్ట్ కిల్లర్ గా కాస్త నవ్విస్తాడు. కృష్ణుడు, అరియనా గ్లోరీ, పండు, మనోజ్ నందం, చిత్రం శ్రీను.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.
సాంకేతిక అంశాలు: సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. కన్నడ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఇచ్చారు. పాటలు పర్వాలేదనిపిస్తాయి. కథ కొత్త పాయింట్ తీసుకున్నా కథనంలో కాస్త తడబడ్డాడు డైరెక్టర్. AI తో చేసిన సాంగ్ బాగుంది. నిర్మాణ పరంగా కావాల్సినంత ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘షణ్ముఖ’ సినిమా అమ్మాయిల మిస్సింగ్ కేసులు, ఆరు తలలతో పుట్టిన మనిషితో థ్రిల్లింగ్ గా సాగుతుంది. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం
- ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లో ఐఎస్ఐ ఏజెంట్..
- ఎన్నారై టిడిపి చొరవతో ఒమాన్ నుండి ఏపీకి చేరుకున్న యువకులు
- ట్రంప్ మిడిలీస్ట్ పర్యటనను ప్రారంభం..తొలి విదేశీ పర్యటన..!!
- కువైట్ ప్రైవేట్ ఫార్మసీలలో 69 మెడిసిన్ ధరలపై నియంత్రణ..!!
- జాసిమ్ బిన్ హమద్ స్ట్రీట్ లో ట్రాఫిక్ ఆంక్షలు..మూసివేత..!!
- రియాద్‌లో బైక్ డెలివరీ ఆర్డర్లు నిలిపివేత..!!
- CBSE 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల..!!
- పార్కింగ్ వివాదం.. ముగ్గురు మహిళలను కాల్చిచంపిన నిందితుడు..!!
- జార్ఖండ్‌లో శస్త్రచికిత్స శిబిరాలు నిర్వహించిన శంకర నేత్రాలయ