అందాన్ని మరింతగా ఇనుమడింప చేసే ఆలివ్‌నూనె...

- July 05, 2016 , by Maagulf
అందాన్ని మరింతగా ఇనుమడింప చేసే ఆలివ్‌నూనె...

మెరిసే మేని...నిగనిగలాడే జుట్టు మన అందాన్ని ద్విగుణీకృతం చేస్తాయి. ఇలాంటి సొగసుని సొంతం కావడానికి ఆలివ్‌నూనెను వాడి చూడండి. ఇందులోని పోషకాలు అందాన్ని మరింతగా ఇనుమడింప చేస్తాయి.
ప్ర తిరోజూ ఆలివ్‌ నూనెను ఒంటికి పట్టించి ఓ అరగంటయ్యాక స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల నూనెలో లభించే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్‌ ఎ, ఇ లు చర్మాన్ని కాంతిమంతంగా చేసి తేమనందిస్తాయి. చర్మం ముడతలు పడకుండా.. యౌవనంగా మెరిసిపోతుంది.
*
నాలుగు చెంచాల చక్కెరకు రెండు చెంచాల ఆలివ్‌ నూనె, గులాబీ నూనె కలిపి ఒంటికి రాసుకుని మృదువుగా మర్దన చేసుకోవాలి. ఇలా చేస్తుండటం వల్ల మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతిమంతంగా మారుతుంది. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేసుకుంటే ఫలితం ఉంటుంది.
*
పొడిబారే చర్మతత్వం ఉన్నవారు పడుకునే ముందు ఆలివ్‌ నూనె రాసుకోవాలి. మర్నాటికి చర్మం తేమగా, తాజాగా మారుతుంది. జుట్టు నిర్జీవంగా మారి కళ తప్పినప్పుడు ఆలివ్‌ నూనె చక్కగా పనిచేస్తుంది. ఆలివ్‌ నూనెను వేడి చేసి గోరువెచ్చగా అయ్యాక తలకు పట్టించాలి. మర్నాడు తలస్నానం చేస్తే జుట్టు మెత్తగా మారుతుంది.
*
ఆలివ్‌నూనెలో చెంచాచొప్పున తేనె నిమ్మరసం కలిపి ముఖానికీ, మెడకీ రాసుకోవాలి. పావుగంటపాటు మర్దన చేసుకున్నాక చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వీటిల్లోని సి విటమిన్‌తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు అంది చర్మం ఆరోగ్యంగా మారుతుంది.
*
కొందరికి గోళ్లు పెళుసుబారి విరిగిపోతుంటాయి. ఇలాంటప్పుడు గోరువెచ్చని ఆలివ్‌ నూనెలో రెండు చుక్కల నిమ్మరసం కలిపి కాసేపు వేళ్లని ఉంచాలి. తరవాత మృదువుగా మర్దన చేసుకుని కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల గోళ్లకు తగిన పోషణ అంది దృఢంగా మారతాయి. ఆరోగ్యంగా ఎదుగుతాయి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com