ఆన్‌లైన్‌ గేమింగ్‌ వెబ్‌సైట్స్‌పై కేంద్రం కొరడా

- March 23, 2025 , by Maagulf
ఆన్‌లైన్‌ గేమింగ్‌ వెబ్‌సైట్స్‌పై కేంద్రం కొరడా

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ గేమింగ్‌ వెబ్‌సైట్లపై కేంద్రం కొరడా ఝుళిపించింది.జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ అధికారులు అక్రమ ఆఫ్‌షోర్‌ ఆన్‌లైన్‌ గేమింగ్‌ సంస్థల 357 వెబ్‌సైట్‌లను బ్లాక్‌ చేశారు. దాదాపు 2,400 బ్యాంక్‌ ఖాతాలను అటాచ్‌ చేశారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని తెలిపింది. రూ.126 కోట్లను ఫ్రీజ్‌ చేసినట్టు పేర్కొన్నది. మనీ గేమింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌తో అప్రమత్తంగా ఉండాలనీ, వాటిని ఎవరూ వినియోగించొద్దని డీజీజీఐ సూచించింది.

కొన్ని సంస్థలను నమోదు చేయకుండా, ఆదాయాన్ని దాచిపెడుతూ జిఎస్‌టి ఎగవేతలకు పాల్పడుతున్న చట్టవిరుద్ధమైన ఆన్‌లైన్‌ మనీ గేమింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌పై చర్యలు తీసుకున్నామనీ, 357 వైబ్‌సైట్స్‌ని ఐటీశాఖ సమన్వయంతో బ్లాక్‌ చేసినట్టు మంత్రిత్వశాఖ పేర్కొన్నది. బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌కు పాల్పడుతోన్న సుమారు 700 సంస్థలపై నిఘా వేసినట్టు వివరించింది.
దేశం వెలుపల ఈ తరహా సంస్థలు నడుపుతోన్న పలువురు భారతీయులపై డీజీజీఐ మరో ఆపరేషన్‌ చేపట్టి.. వారికి సంబంధించిన 166 ఖాతాలను బ్లాక్‌ చేసింది. ఈ సందర్భంగా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నది. చాలామంది బాలీవుడ్‌ ప్రముఖులు, క్రికెటర్లు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ ఈ ప్లాట్‌ఫామ్స్‌కు ప్రచారం నిర్వహిస్తున్నట్టుగా గుర్తించినట్టు పేర్కొన్నది. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, ఆ ప్లాట్‌ఫామ్స్‌ వ్యక్తుల ఆర్థిక భద్రతను దెబ్బతీసే అవకాశం ఉన్నదనీ, దేశ భద్రతను దెబ్బతీసే కార్యకలాపాలకు అవి పరోక్షంగా మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com