గల్ఫ్ కార్మికుల మానవత్వం
- January 12, 2026
తెలంగాణ: తెలంగాణలోని మండలంలోని వి.వి.రావుపేట్ గల్ఫ్ సంఘం సేవాభావాన్ని మరోసారి చాటింది. వేంపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నిమ్మల రాములు అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న సంఘం సభ్యులు,వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు గుర్తించి తక్షణ సాయంగా ఆర్థిక సహాయం అందజేశారు.అదే గ్రామానికి చెందిన పాముల గంగాధర్ కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు పెనుకుల అశోక్ మాట్లాడుతూ,సంఘం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు గల్ఫ్ కార్మిక కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు కలిపి సుమారు 50 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించామని తెలిపారు.కన్న ఊరి అభివృద్ధి కోసం గల్ఫ్ కార్మికులు తమ నెల జీతంలో భాగం సహాయం చేయడంలో ముందుంటారని పేర్కొన్నారు.భవిష్యత్తులో కార్మికుల హక్కులు, గ్రామ అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అరెల్లి మహేష్, నలిమేలా ప్రసాద్,బి.ఎల్.నారాయణ గౌడ్,పోతు రఘు,మెండే ప్రవీణ్,మాచర్ల ఆది రెడ్డి,అన్నవరం రవితేజ,కండల వెంకటి,కనుమల విశాల్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







