వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్

- January 12, 2026 , by Maagulf
వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్

వెనెజువెలా అధ్యక్షుడిని తానేనంటూ తనకు తానే ప్రకటించుకున్నారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. “వెవెజువెలా తాత్కాలిక అధ్యక్షుడు. 2026 జనవరి నుంచి పదవిలో ఉన్నారు” అని వికీపీడియా శైలిలో రూపొందించిన ఇమేజ్‌ను ఆయన తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్‌లో పోస్ట్ చేశారు.

అలాగే, అమెరికా 45వ, 47వ అధ్యక్షుడిగా పదవీకాలం వివరాలు కూడా అందులో ఉన్నాయి. నిజానికి వికీపీడియా రియల్ పేజీలో ట్రంప్‌ను వెనెజువెలా ఆక్టింగ్ ప్రెసిడెంట్‌గా పేర్కొనలేదు. ఏ అంతర్జాతీయ సంస్థ కూడా ఈ ప్రకటనను గుర్తించలేదు.

వెవెజువెలా అధ్యక్షుడు నికోలాస్ మదురోను అమెరికా అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత తామే వెనెజువెలాను పాలిస్తామని, ఆ దేశంలో పరిస్థితులు సాధారణ స్థితిలోకి వచ్చేవరకు తమ పాలనే ఉంటుందని అన్నారు.

ఇప్పుడు తానే వెవెజువెలా తాత్కాలిక అధ్యక్షుడినంటూ రూపొందించిన నకిలీ ఇమేజ్‌ను ట్రంప్‌ పోస్ట్ చేశారు. ప్రస్తుతం మదురోతో పాటు ఆయన భార్య కూడా అమెరికాలోని జైలులో ఉన్నారు.

కాగా, వెవెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్ 2026 జనవరి 5 నుంచి పనిచేస్తున్నారు. వెనెజువెలాపై అమెరికా చేసిన దాడిని అంతర్జాతీయ చట్టాల ఘోర ఉల్లంఘనగా చైనా, రష్యా, కొలంబియా, స్పెయిన్ దేశాలు పేర్కొన్నాయి.

అమెరికాతో సహకరించకపోతే డెల్సీ రోడ్రిగ్జ్ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందంటూ ట్రంప్ హెచ్చరించారు. న్యూయార్క్‌లో నార్కో టెర్రరిజం, డ్రగ్ ట్రాఫికింగ్ కేసుల్లో నిర్బంధంలో ఉన్న మదురో కంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com