బంగారం ధరలకు రెక్కలు.. $3,200కి చేరుకునే అవకాశం..!!

- March 23, 2025 , by Maagulf
బంగారం ధరలకు రెక్కలు.. $3,200కి చేరుకునే అవకాశం..!!

యూఏఈ: ఈ నెల ప్రారంభంలో $3,000 స్థాయిని దాటిన తర్వాత బంగారం ధరలు మరింత దూసుకుపోతున్నాయి. రాబోయే కొన్ని త్రైమాసికాల్లో $3,200కి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, గోల్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు)లోకి పెట్టుబడులు, US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కోతలు,  సెంట్రల్ బ్యాంక్ కొనుగోలు నేపథ్యంలో బంగారానికి మద్దతు కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మార్చి 14న బంగారం ధరల తొలిసారిగా ఔన్సుకు $3,000 మార్కును దాటింది.    

"మేము బంగారంపై మా బుల్లిష్ వైఖరిని కొనసాగిస్తున్నాము. మా మునుపటి లక్ష్యమైన ఔన్సుకు $3,000 చేరుకున్న తర్వాత, జూన్ నాటికి నాటికి ఔన్సుకు $3,200 కు మా లక్ష్యాన్ని సవరించాము" అని UBS గ్లోబల్ వెల్త్ మేనేజ్‌మెంట్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ మార్క్ హేఫెల్ అన్నారు.

ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభిస్తే, బంగారం $3,100–$3,125 శ్రేణికి పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ ఆర్థిక ఆందోళనలు పెరిగితే లేదా ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ అంతరాయాలను ఎదుర్కొంటే $3,180–$3,200 వరకు మరింత లాభాలు పొందే అవకాశం ఉంది. దాంతోపాటు కేంద్ర బ్యాంకులు.. ముఖ్యంగా చైనా, రష్యాలో కొనసాగుతున్న బంగారం కొనుగోళ్లు బుల్లిష్ ధోరణిని బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com