సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!
- March 18, 2026
మనామా: సున్నితమైన నిషేధిత ప్రాంతాల్లో ఫోటోలు తీసి, వాటిని ప్రచురించిన ఆరోపణల పై పలువురు నిందితులను క్రిమినల్ విచారణకు అప్పగించినట్లు ఉగ్రవాద నేరాల ప్రాసిక్యూషన్ విభాగాధిపతి ప్రకటించారు.
ఇరాన్ దాడుల తరుణంలో, అనుమానితులు కీలకమైన ప్రదేశాలకు సంబంధించిన సమాచారం మరియు వివరాలను వెల్లడిస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. ఇటువంటి చర్యలు దేశ జాతీయ భద్రతకు హాని కలిగించవచ్చని అధికారులు పేర్కొన్నారు.
ఈ మేరకు అవినీతి నిరోధక మరియు ఆర్థిక, ఎలక్ట్రానిక్ భద్రత జనరల్ డైరెక్టరేట్ యొక్క సైబర్‌క్రైమ్ విభాగం నుండి పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు నివేదికలు అందిన తర్వాత కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
ఇటీవలి దాడులలో లక్ష్యంగా చేసుకున్న ప్రదేశాలతో పాటు ఇతర వ్యూహాత్మక ప్రాంతాలను తెలిపే సున్నితమైన ప్రదేశాల ఫోటోలను పలు సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారని ఆ నివేదికలు స్పష్టం చేశాయి.
అధికారులు దర్యాప్తు చేసి అనుమానితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ప్రాసిక్యూటర్లు విచారించి అనేక విషయాలను రాబట్టినట్టు అధికారులు తెలిపారు. వారిని క్రిమినల్ కోర్టుకు అప్పగించే ముందు రిమాండ్ లో ఉంచాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశించిందన్నారు.
ప్రస్తుత పరిస్థితులలో కీలకమైన ప్రదేశాలు, సైనిక లేదా భద్రతా చర్యలు, లేదా కొనసాగుతున్న కార్యకలాపాలకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని ఫోటో తీయడం వాటిని సోషల్ మీడియాలో పంచుకోవడం వంటివి ఖచ్చితంగా నిషేధం పరిధిలోకి వస్తాయని హెచ్చరించారు.
సోషల్ మీడియాను ఉపయోగించేటప్పుడు ప్రజలు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఆయన కోరారు. నిబంధనలను ఉల్లంఘించినా లేదా జాతీయ భద్రతకు భంగం కలిగించే చర్యలకు పాల్పడినా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







