ఈ నెల 8 నుంచి ఆగస్టు 3 వరకు డ్రోన్ కెమెరాలపై నిషేదం
- July 05, 2016
ఉగ్ర దాడుల నేపథ్యంలో నగర గగనతలంపై రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే డ్రోన్లు, మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్స్, పారా గ్లైడర్స్ను నిషేధిస్తున్నట్టు నగర పోలీసులు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆకాశమార్గం గుండా అసాంఘిక శక్తులు, ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉంటుందనే కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. ఉత్సవాలు, వివాహ వేడుకల సమయంలో కూడా నిషేధం అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రజా భద్రత దృష్ట్యా నిబంధనలు ఈ నెల 8 నుంచి ఆగస్టు 3 వరకు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







