ఈద్ అల్-ఫితర్ సెలవులను ప్రకటించిన బ్యాంకులు..!!
- March 26, 2025
కువైట్: కువైట్ లోని బ్యాంకులు ఈద్ అల్-ఫితర్ సెలవులను ప్రకటించాయని కువైట్ బ్యాంకింగ్ అసోసియేషన్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ షేఖా అల్-ఎస్సా తెలిపారు. కువైట్ సెంట్రల్ బ్యాంక్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. ఈద్ అల్-ఫితర్ మొదటి రోజు 30/3/2025(ఆదివారం) వస్తే, స్థానిక బ్యాంకులు ఆదివారం, సోమవారం, మంగళవారం ( మార్చి 30, 31, ఏప్రిల్ 1న) మూసివేయబడతాయి. ఏప్రిల్ 2న(బుధవారం) నాడు కార్యాలయాలు తిరిగి ప్రారంభమవుతాయి.
అయితే, ఈద్ మొదటి రోజు మార్చి 31(సోమవారం) వస్తే, స్థానిక బ్యాంకులు ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం( మార్చి 30, 31, ఏప్రిల్ 1, 2న) మూసివేయబడతాయి. అధికారిక పనివేళలు తిరిగి ఏప్రిల్ 3వ తేదీన (గురువారం) తిరిగి ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు
- తెలంగాణ: 325 పోలీస్ డ్రైవర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..
- అన్నమాచార్య ప్రాజెక్టులో స్వరలయ ఆర్ట్స్ (సింగపూర్) భక్తిసంగీత వైభవం
- శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్
- FIFA వరల్డ్ కప్ విజేతకు రూ.450 కోట్లు
- కుప్పకూలిన విమానం..ప్రముఖ రేసర్ కన్నుమూత
- కువైట్ లో జనవరి 1వ తేదీన సెలవు..!!
- కొత్త ప్రైవేట్ పాఠశాలలపై షురా కౌన్సిల్ ఓటింగ్..!!
- సౌదీ అరేబియాలో షార్క్ కేజ్ డైవింగ్..లైసెన్స్ జారీ..!!
- కువైట్లో 'హిమ్యాన్' కార్డుకు అనుమతి..!!







