ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!

- March 27, 2025 , by Maagulf
ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!

కువైట్:ఈద్ అల్-ఫితర్ ముందు వివిధ డినామినేషన్ల నోట్లకు డిమాండ్ పెరిగింది. దీనిపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ (CBK) స్పందించింది. ప్రధాన షాపింగ్ మాల్స్‌లోని ఎంపిక చేసిన ATMలలో కొత్త కువైట్ దినార్ నోట్ల లభ్యతను ప్రకటించింది. ది అవెన్యూస్, 360 మాల్, అల్-కౌట్ మాల్, క్యాపిటల్ మాల్‌లోని ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్ల (ATMలు) లో కొత్త నోట్లతో నిండి ఉంటాయని,  ఈద్ మొదటి రోజు వరకు పనిచేస్తాయని CBK ఒక ప్రకటనలో ధృవీకరించింది.

ఈ సంవత్సరాల్లో ఈ సర్వీస్ దేశవ్యాప్తంగా 308 బ్యాంకు శాఖలు, 101 ATMలలో కొత్త నోట్లను సరఫరా చేసినట్లు అయినట్లు గుర్తించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com