విగ్గులను బహుమతిగా ఇస్తున్న చార్మి..
- July 06, 2016
జుట్టు పొడవుగా, అందంగా ఉండే నటీమణుల్లో చార్మి ఒకరు. అలాంటిది ఆమె హఠాత్తుగా తన శిరోజాలను భుజాలవరకూ కత్తిరించేసుకున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఇద్దరు యువతులకు విగ్గులు తయారు చేయించడం కోసం చార్మి తన జుట్టును కత్తిరించేశారట. దీంతో రెండు విగ్గులు తయారు చేయించి యువతులకు బహుమతిగా ఇస్తానని చార్మి చెబుతున్నారు.'ఇటీవల నా స్నేహితుడు.. తానుండే ప్రదేశంలో ఇద్దరు యువతులు క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, వారికి నేనంటే చాలా అభిమానమని తెలిపాడు. దీంతో నేను వారిని కలిసి వారితో కొంత సమయం గడిపాను. ప్రస్తుతం వారికి క్యాన్సర్ ట్రీట్‌మెంట్ జరుగుతోంది. ఈ కారణంగా వారిద్దరు జుట్టును కోల్పోయారు. వారితో మాట్లాడుతుండగా ఇద్దరూ నా జుట్టును పట్టుకుని 'చార్మి అక్క, మీ హెయిర్ చాలా బావుంది' అన్నారు. దీంతో నా హెయిర్ స్టైలిస్ట్‌ని పిలిపించి జుట్టును కత్తిరించాను. 18 అంగుళాల ఆ జుట్టును రెండు విగ్గులు తయారు చేయమని చెప్పాను.త్వరలో వారిని మళ్లీ కలిసి విగ్గులను బహుమతిగా ఇస్తాను. అవి ఇస్తుండగా వారి కళ్లల్లో ఆనందాన్ని చూడాలని చాలా ఆతృతగా ఉంది' అని చార్మి ఓ పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







