2015 నుండి జరిగిన ‘డ్రా’లపై తనిఖీలు: కువైట్
- March 28, 2025
కువైట్: 2015 నుండి ప్రారంభమైన బ్యాంకులు, వాణిజ్య సంస్థల డ్రాలను పరిశీలించి, వాటి చట్టబద్ధతను నిర్ణయించడం జరుగుతుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ నిజనిర్ధారణ కమిటీ తెలిపింది. ఆధారాలు, చట్టపరమైన ప్రక్రియను బట్టి పరిశీలన తేదీని పొడిగించవచ్చని కమిటీ అధిపతి అద్నాన్ అబోల్ అన్నారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలకు సంబంధించి ప్రజలు ఫిర్యాదులు, సమాచారాన్ని స్వీకరించడానికి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.
మరోవైపు రాఫెల్ డ్రాల కుంభకోణానికి సంబంధించిన ఒక కువైట్ పౌరుడు, ఐదుగురు ప్రవాసులను అరెస్టు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతర అనుమానితుల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఇంటర్‌పోల్‌తో అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్‌లను కూడా జారీ చేసింది.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







