ఏప్రిల్‌లో ఇంధన ధరలు తగ్గుతాయా?
- March 28, 2025
యూఏఈ: మార్చిలో ప్రపంచ ధరలు తక్కువగా ఉండటంతో.. పెట్రోల్ ధరలు ఏప్రిల్ నెలలో తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఫిబ్రవరిలో $75తో పోలిస్తే మార్చిలో బ్రెంట్ ధర సగటున $70.93గా ఉంది. దాంతో రాబోయే రోజుల్లో వచ్చే నెలకు కొత్త ధరలు ప్రకటించినప్పుడు యూఏఈలో పెట్రోల్ ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. యూఏఈ ప్రభుత్వం సాధారణంగా ప్రతి నెల చివరి రోజున సవరించిన ధరలను ప్రకటిస్తుంది.
మార్చిలో సూపర్ 98 లీటరుకు Dh2.73, స్పెషల్ 95 ధర Dh2.61, E-ప్లస్ ధర Dh2.54. ప్రపంచవ్యాప్తంగా, బ్రెంట్ ధర శుక్రవారం ప్రారంభ వాణిజ్యంలో బ్యారెల్‌కు $74.11, WTI బ్యారెల్‌కు $70.01 వద్ద ట్రేడవుతోంది.
ఇటీవలి ప్రపంచ పరిణామాల మధ్య ముడి చమురు ధరలలో అస్థిరత పెరిగే అవకాశం ఉందని టిక్‌మిల్ మేనేజింగ్ ప్రిన్సిపాల్ జోసెఫ్ దహ్రీహ్ అన్నారు. వెనిజులా చమురు కొనుగోలు చేసే దేశాలపై అమెరికా సుంకాల ప్రకటన నేపథ్యంలో ప్రపంచ డిమాండ్‌ను బలహీనపరిచే ప్రమాదం ఉందన్నారు. మరోవైపు ఒపెక్+ ముడి చమురు ఉత్పత్తిలో మార్పులు మార్కెట్‌ను ప్రభావితం చేయవచ్చని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు







