ఏపీ: నూకాంబిక కు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కొల్లు ర‌వీంద్ర‌

- March 29, 2025 , by Maagulf
ఏపీ: నూకాంబిక కు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కొల్లు ర‌వీంద్ర‌

విశాఖపట్నం: అనకాపల్లి నూకాంబిక అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ మహోత్సవాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. జాతర మహోత్సవాలు ప్రారంభోత్సవం సందర్భంగా ఇవాళ‌ ఉదయం రాష్ట్ర గనులు, భూగర్బ, ఎక్సైజ్ శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, జాయింట్ కలెక్టర్ ఎమ్.జాహ్నవి, శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయకుమార్, కె.ఎస్.ఎన్.రాజు, అర్బన్ పైనాన్స్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషను చైర్మన్ పీల గోవింద సత్యనారాయణ,ఎ.పి.గవర సంక్షేమ, అభివృద్ది కార్పొరేషను చైర్మన్ మల్ల సురేంద్ర, కొప్పులవెలమ సంక్షేమ, అభివృద్ది కార్పొరేషను చైర్మన్ పి.వి.జి. కుమార్ అతిధులుగా పాల్గొన్నారు.అమ్మవారి దర్శనం అనంతరం అతిధులకు ఆలయ అధికారులు వేద ఆశీర్వచనాలు, అమ్మవారి ప్రతిమ, ప్రసాదాలు అందజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com