ఈద్ ట్రావెల్ ప్రణాళికలను రద్దు చేసుకుంటున్న యూఏఈ నివాసితులు..!!
- March 29, 2025
యూఏఈ: థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో బలమైన భూకంపం తర్వాత కూలిపోయిన భవనం వద్ద రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మార్చి 28న మయన్మార్, పొరుగున ఉన్న థాయిలాండ్‌ను 7.7 తీవ్రతతో భూకంపం కబలించింది. ఈ నేపథ్యంలో కొందరు యూఏఈ నివాసితులు ఈద్ అల్ ఫితర్ సెలవులకు థాయిలాండ్‌కు వెళ్లాలని అనుకున్న పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే కచ్చితమైన సమాచారం తమ వద్ద లేదని చెబుతున్నారు. మరోవైపు థాయిలాండ్‌లో ఇప్పటికే ఉన్న కొందరు యూఏఈకి తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
దుబాయ్ నివాసి అహ్మద్ అలీ తన ఐదుగురు స్నేహితులతో కలిసి ఈ ఆదివారం బ్యాంకాక్‌కు విమానంలో వెళ్లాలని మొదట ప్లాన్ చేసుకున్నారు. వారు నాలుగు రోజుల సెలవుల కోసం తమ ట్రావెల్ ఏజెంట్‌కు ఒక్కొక్కరికి దిర్హం 3,700 చెల్లించాల్సి ఉంది. కానీ రెండు పొరుగున ఉన్న ఆగ్నేయాసియా దేశాలను కుదిపేసిన భూకంపం కారణంగా చివరి నిమిషంలో వారు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకోవలసి వచ్చింది.
“మేము మొదటిసారి బ్యాంకాక్‌కు వారాంతాన్ని ఆస్వాదించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. కానీ భూకంపం గురించి వార్తలు చూసిన తర్వాత, మేము అక్కడికి వెళ్లే ఆలోచనను విరమించుకున్నాము. మా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి కదా.” అని అలీ అన్నారు. ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈద్ అల్ ఫితర్‌ను ఒమన్‌లోని ముసాందంలో గడపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా, వైజ్‌ఫాక్స్ టూరిజం సీనియర్ మేనేజర్ సుబైర్ థెకేపురథ్వలప్పిల్ మాట్లాడుతూ.. థాయిలాండ్ అత్యంత ఇష్టపడే గమ్యస్థానాలలో ఒకటిగా ఉందన్నారు. చాలా మంది యూఏఈ నివాసితులు అక్కడికి వెళ్లడానికి ఆసక్తిగా ఉన్నారని, ఎందుకంటే ఇది త్వరగా వెళ్లడానికి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం అని అన్నారు. థాయిలాండ్‌లోని ఫుకెట్, చియాంగ్ మాయి వంటి ఇతర ప్రసిద్ధ ప్రదేశాలకు వెళ్లేందుకు ప్రజలు ఇప్పటికీ ప్రణాళిక ప్రకారం ప్రయాణించడానికి ఉత్సాహంగా, ఆసక్తిగా ఉన్నారని తెలిపారు.
మయన్మార్, పొరుగున ఉన్న థాయిలాండ్‌ను కుదిపేసిన శక్తివంతమైన భూకంపం ఫలితంగా 700 మందికి పైగా మరణించారు.
బ్యాంకాక్‌లోని యూఏఈ రాయబార కార్యాలయం థాయిలాండ్‌లోని తమ పౌరులను జాగ్రత్తగా ఉండాలని కోరింది. అధికారులు జారీ చేసిన భద్రతా సూచనలను పాటించాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో 0097180024 లేదా 00971800444444 ను సంప్రదించి తవాజుడి సేవ కోసం నమోదు చేసుకోవచ్చని మిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!







