దుబాయ్ లో డ్రగ్స్ వినియోగించిన వ్యక్తికి 3 నెలల జైలు శిక్ష..!!
- March 29, 2025
యూఏఈ: 89 గ్రాముల హెరాయిన్‌తో పట్టుబడిన 38 ఏళ్ల ఆసియా వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష విధించింది దుబాయ్ క్రిమినల్ కోర్టు. మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుని, శిక్ష పూర్తయిన తర్వాత అతనిని దేశం నుండి బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. ఆ వ్యక్తి అల్ సత్వాలోని తన నివాసంలో మాదకద్రవ్యాలను ఉపయోగిస్తున్నాడని పోలీసులకు సమాచారం అందడంతో వారు రైడ్ చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమాచారం ఆధారంగా, జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ యాంటీ-నార్కోటిక్స్ అధికారులు రైడింగ్ చేసి, అతని వద్ద నుండి మూడు హెరాయిన్ ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
విచారణ సమయంలో, ఆ వ్యక్తి వ్యక్తిగత ఉపయోగం కోసం హెరాయిన్‌ను కొనుగోలు చేసినట్లు అంగీకరించాడు. అతను వాట్సాప్ ద్వారా మరొక ఆసియా వ్యక్తి నుండి డ్రగ్స్‌ను కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు. దుబాయ్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ తరువాత ప్రారంభ తీర్పును సమర్థించింది.
తాజా వార్తలు
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!







