రేపే భారత్ లో ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు

- March 30, 2025 , by Maagulf
రేపే భారత్ లో ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు

న్యూ ఢిల్లీ: పవిత్ర రంజాన్ నెల నేటితో ముగియనుంది. 1446 షవ్వాల్ నెలకు నెలవంక దేశంలో కనిపించిందని సౌదీ అధికారులు శనివారం ప్రకటించారు. దీంతో అరబ్ దేశమైన సౌదీలో అదివారమే ఈద్ ఉల్ ఫితర్ మొదటి రోజును పాటిస్తుంది. అక్కడ రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా నేటి ఉదయం ప్రారంభ మయ్యాయి.సౌదీ అరేబియాలో ఈద్ చంద్రుడు కనిపించిన ఒక రోజు తర్వాత భారతదేశంలో ఈద్ చంద్రుడు కనిపిస్తాడు. చంద్రుడు కనిపించిన ఒక రోజు తర్వాత అంటే రేపు ఈద్ పండుగ జరుపుకుంటారు.

భారతదేశంలో పవిత్ర రంజాన్ మాసం మార్చి 2న ప్రారంభం అయ్యింది. అంటే ఈద్ ఉల్ ఫితర్ మార్చి 31 లేదా ఏప్రిల్ 1న వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలో, ఈద్ చంద్రుడు కనిపించినప్పుడు మాత్రమే ఈద్ నిర్ణీత తేదీని పరిగణిస్తారు.. నిన్న సౌదీ లో నెల వంక కనిపించడం తో రేపు భారత్ లో ఈద్ ఉల్ ఫితర్ జరపాలని మత పెద్దలు నిర్ణయించారు.ఆ రోజున, ఈద్గాలో ప్రార్థనలు చేస్తారు. ప్రజలు ఒకరికొకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com