HCA, సన్ రైజర్స్ మధ్య వివాదం మొదలైంది ఇక్కడే!

- April 01, 2025 , by Maagulf
HCA, సన్ రైజర్స్ మధ్య వివాదం మొదలైంది ఇక్కడే!

హైదరాబాద్: ఉచిత పాస్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) తమను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోందని, అధ్యక్షుడు జగన్మోహనరావు పలుమార్లు బెదిరించారని ఇలాగైతే తాము హైదరాబాద్ వదిలి వెళ్లిపోతామని సన్ రైజర్స్ హైదరాబాద్ హెచ్చరించింది.ఈ మేరకు హెచ్సీఏ కోశాధికారికి సన్ రైజర్స్ ప్రతినిధి లేఖ రాశారు. కోరినన్ని పాస్లు ఇవ్వనందుకు ఇటీవల కార్పొరేట్ బాక్స్ కు తాళాలు వేసిన విషయాన్ని లేఖ ద్వారా సన్ రైజర్స్ బయటపెట్టింది. మ్యాచ్ ప్రారంభం కావడానికి గంట ముందు వరకు దాన్ని తెరవలేదని తెలిపింది. మ్యాచ్ మొదలవబోతుండగా ఇలా బ్లాక్మెయిల్ చేయడం అన్యాయమని చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో సమన్వయంతో పనిచేయడం కష్టమని పేర్కొంది. దీన్ని సంఘం దృష్టికి కూడా తీసుకొచ్చామని, అధ్యక్షుడి ప్రవర్తనను బట్టి చూస్తే ఈ స్టేడియంలో సన్ రైజర్స్ ఆడటం ఇష్టం లేనట్లుగా ఉందని తెలిపింది. అదే ఉద్దేశమైతే బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించి మరో వేదికకు మారిపోతామని తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com