యూఏఈలో సాలిక్ ఫీ మినహాయింపు..ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?
- April 02, 2025
యూఏఈ: రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) అమలు చేసిన ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ అయిన సాలిక్..ఎమిరేట్ అంతటా ఏర్పాటు చేసిన పది టోల్ గేట్లలో దేనినైనా వాహనాలు దాటినప్పుడు ప్రీపెయిడ్ ఖాతా నుండి టోల్ ఫీ ఆటోమెటిక్ గా డెబిట్ అవుతోంది.
కాగా, సాలిక్ ఒక మినహాయింపు పథకాన్ని ప్రకటించింది. దీని ద్వారా కొంతమంది నివాసితులు, వారి బంధువులు టోల్ ఫీ మినహాయింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
సాలిక్ ఫీ మినహాయింపుకు ఎవరు అర్హులు?
- మానసిక వైకల్యాలు, శారీరక వైకల్యాలు, ఆటిజం, విజిబిలిటీ వైకల్యాలు
- సదరు సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి బంధువుల కోసం సాలిక్ ఫీ మినహాయింపు కోసం అనుమతిని పొందవచ్చు. అర్హత కోసం ఆమోదయోగ్యమైన సంబంధాలలో తల్లిదండ్రులు, భర్త లేదా భార్య (వివాహ ఒప్పందం అవసరం), పిల్లలు (జనన ధృవీకరణ పత్రం అవసరం), తాతామామలు, సోదరీమణులు లేదా సోదరులు, మనవరాళ్ళు వారి తరఫున అప్లే చేసుకోవచ్చు. అవసరమైన పత్రాలతో ఇమెయిల్‌కు([email protected]) పంపాలి.
మినహాయింపు ఎంతకాలం ఉంటుంది?
- మినహాయింపు చెల్లుబాటు ఒక సంవత్సరం. ఏదైనా ఉల్లంఘనలను నివారించడానికి కస్టమర్ దానిని వార్షిక ప్రాతిపదికన పునరుద్ధరించుకోవాలి.
- దరఖాస్తు చేసుకునే ప్రక్రియ
- నివాసితులు సలిక్ వెబ్సైట్ ద్వారా లేదా [email protected] కు ఇమెయిల్ పంపవచ్చు.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్‌లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!