షార్జా ఐకానిక్ సఫీర్ మాల్ మూసివేత..!!
- April 03, 2025
యూఏఈ: ప్రముఖ షార్జా షాపింగ్ మాల్ సఫీర్ మాల్ మూసివేయనున్నారు. ఒక ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌గా మారిన ఈ మాల్ రెండు నెలల క్రితం మూసివేసినట్లు అల్ సఫీర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లోని కాల్ సెంటర్ ఏజెంట్ ధృవీకరించారు. మాల్ పేరు, లోగోను భవనం నుండి తొలగించారు. షార్జాలోని అల్ ఖాన్ రోడ్‌లోని మాల్‌లో మూడు అంతస్తులు, రెండు బేస్‌మెంట్ పార్కింగ్ స్లాట్లు ఉన్నాయి.
2005లో అల్ సఫీర్ గ్రూప్స్ నిర్మించిన ఈ షాపింగ్ గమ్యస్థానం.. షార్జా నివాసితులకు ఒక ముఖ్యమైన ప్రదేశంగా గుర్తింపు పొందింది. రెండు దశాబ్దాల క్రితం మొదట డిస్కౌంట్ సెంటర్‌గా ప్రారంభమైన దానిని తరువాత గ్రూప్ విస్తరించింది. సఫీర్ మాల్ అని పేరు మార్చింది.
సఫీర్ గ్రూప్స్ 1985లో షార్జాలోని షాప్ ఎన్ సేవ్ సూపర్ మార్కెట్‌లతో యూఏఈలో తన వెంచర్‌ను ప్రారంభించింది. 1997లో ఈ గ్రూప్ ఎమిరేట్‌లో డిస్కౌంట్ మార్కెట్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత 2000లో నహ్దాలో సఫీర్ మార్కెట్‌ను ప్రారంభించింది. 2005లో దుబాయ్-షార్జా హైవేపై ఉన్న కస్టమర్లకు సఫీర్ మాల్ దాని తలుపులు తెరిచింది.
ప్రస్తుతం, ఈ గ్రూప్ దుబాయ్‌తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలలో హైపర్‌మార్కెట్లు, మార్ట్‌లను కలిగి ఉంది.దాంతోపాటు , అజ్మాన్‌లోని సఫీర్ మాల్, దుబాయ్ హోర్ అల్ అంజ్ ఈస్ట్‌లో ఉన్న మరొక షాపింగ్ అవుట్‌లెట్ అయిన రస్ అల్ ఖైమా, 2003లో ప్రారంభించిన సెంచరీ మాల్‌ను గ్రూప్ నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







