ఏపీలో 44 బార్లకు ఈ-వేలం

- April 03, 2025 , by Maagulf
ఏపీలో 44 బార్లకు ఈ-వేలం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో లైసెన్సు ఫీజు, నాన్-రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, బిడ్ అమౌంట్ చెల్లించని బార్లను ఈ-వేలం ద్వారా ఔత్సాహికులకు కేటాయించేందుకు మద్యనిషేధ, అబ్కారీ శాఖ సంచాలకులు నోటిఫికేషన్ జారీ చేశారు.ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 44 బార్లను ఈ-వేలం, ఆన్‌లైన్ లాటరీ పద్ధతిలో కేటాయించనున్నారు. బార్ల లైసెన్సులు పొందేందుకు ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 1 నుంచి 7 వరకు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.దరఖాస్తు రుసుమును ఏప్రిల్ 8లోగా చెల్లించాల్సి ఉంటుంది.

ఫీజులు & రిజిస్ట్రేషన్ ప్రక్రియ:

50,000 జనాభా ఉన్న ప్రాంతాల్లో → రూ.5 లక్షలు 50వేలు - 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో → రూ.7.5 లక్షలు 5 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో → రూ.10 లక్షలు ఆన్‌లైన్ వేలం ప్రక్రియలో అధిక మొత్తంలో బిడ్ వేసిన అభ్యర్థికి ఏప్రిల్ 9న బార్ లైసెన్స్ కేటాయించనున్నారు. ప్రాంతాల వారీగా బార్ల వివరాలు, ఆఫ్‌సెట్ ధరలు, గెజిట్ నోటిఫికేషన్ వివరాలను అధికారిక వెబ్‌సైట్http://apcpe.aptonline.in లో అందుబాటులో ఉంచారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com