‘కూలీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
- April 04, 2025
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయబోతున్నారు. ఈసారి అతని తోడుగా ఉండబోతున్నాడు మాస్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న భారీ మాస్ ఎంటర్టైనర్ పేరు ‘కూలీ’.ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పుడు ఆ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ, రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్టు చేస్తూ, ఆగస్టు 14న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని వెల్లడించింది.ఇక లోకేష్ కనకరాజ్ సినిమాలంటే యూత్‌కి ఓ పీకు క్రేజ్ ఉంటుంది. ఆయన స్పీడ్, మాస్ టేకింగ్, స్టైల్ అన్నీ ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తాయి.
తెలుగులో కూడా ‘విక్రమ్’ తర్వాత ఈయన ఫాలోయింగ్ బాగానే పెరిగింది.ఇలాంటి డైరెక్టర్‌తో రజినీకాంత్ కలిసి పని చేయడమంటే… అభిమానులకు ఈ కాంబో ఓ ఫెస్టివల్ లాంటిదే. కూలీ మూవీపై అందుకే ఆసక్తి రెట్టింపైంది. ఈ సినిమా రజినీ ఫ్యాన్స్‌కి పండుగలా ఉండబోతోందనడంలో సందేహం లేదు.ఇంకా ఈ సినిమాకి జోడుగా ఉన్న క్యాస్ట్ కూడా మాస్‌కి బాగా నచ్చుతుంది. గెస్ట్ రోల్స్‌లో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరోలు కనిపించబోతున్నారని సమాచారం. ఈ విషయమే అభిమానుల్లో కొత్త ఎక్సైట్మెంట్ తీసుకొచ్చింది.కెవలం రజినీ స్టైల్‌కి కాదు, లోకేష్ మ్యాజిక్కి కూడా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. థియేటర్లలో కూలీ పేరుతో మళ్లీ రజినీ రచ్చ రేపనున్నాడు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







