శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు: సీపీ సీవీ ఆనంద్
- April 05, 2025
హైదరాబాద్: నగరంలో నిర్వహించే శ్రీరామ నవమి శోభాయాత్రకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉందని, శోభాయాత్రను శాంతియుతంగా, ప్రశాంతంగా నిర్వహించుకోవాలని నగర సీపీ సీవీ ఆనంద్ సూచించారు. శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ శాఖల అధికారులతో సీతారాంబాగ్‌లోని ద్రౌపది గార్డెన్లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో సీపీ సీవీ ఆనంద్ పాల్గొని పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా 20 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామని తెలిపారు.
యాత్రలో షీటీమ్స్, సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో పూర్తిస్థాయిలో నిఘా ఏర్పాటు చేశామన్నారు. శోభాయాత్రను డ్రోన్లు, సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ రూము నుంచి పర్యవేక్షిస్తామని తెలిపారు. సీతారాంబాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు కొనసాగుతున్న శ్రీరామ నవమి శోభా యాత్రలో విగ్రహాల ఎత్తు గురించి జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు, ప్రశాంతంగా జరిగేలా పోలీసులకు సహకరించాలని కోరారు. యాత్రను మధ్యాహ్నం ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా ట్రయల్ రన్ చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు. నిర్వాహకులు డ్రోన్లను వినియోగించేందుకు ముందస్తు అనుమతులు తీసుకోవాలన్నారు.
పెద్ద శబ్దాలతో డీజే వినియోగించడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్న దృష్ట్యా, సౌండ్ సిస్టం వినియోగించుకోవాలని నిర్వాహకులకు సీపీ సూచించారు. శోభా యాత్ర ప్రశాంతంగా ముగిసేలా వివిధ శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ మాట్లాడుతూ.. శోభా యాత్రలో ఇబ్బందలు తలెత్తకుండా రోడ్ల మరమ్మతు, లైటింగ్, వసతులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
మంగళ్‌హాట్ నుంచి పురానాపూల్, జుమ్మేరాత్ బజార్, సిద్ది అంబర్ బజార్, అఫ్జల్‌గంజ్, గౌలిగూడ, కోఠి, ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా మీదుగా హనుమాన్ వ్యాయామశాల వరకు ఓపెన్ టాప్ జీప్‌లో ప్రయాణిస్తూ రూట్‌ను పరిశీలించారు.ఈ సమన్వయ సమావేశంలో అడిషనల్ సీపీ విక్రం సింగ్ మాన్, జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయల్ డేవిస్, డీసీపీలు, భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి సభ్యులు, ఆర్ అండ్ బీ, విద్యుత్, అగ్నిమాపక శాఖ, ఆర్టీసీ, జలమండలి, ఆర్టీఏ, వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు..
తాజా వార్తలు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక







