మక్కా, జెడ్డాకు భారీ వర్ష సూచన..!!

- April 05, 2025 , by Maagulf
మక్కా, జెడ్డాకు భారీ వర్ష సూచన..!!

జెడ్డా: మక్కా నగరం, అల్-జుముమ్, బహ్రా, ఖులైస్, జెడ్డా, రబీగ్‌తో సహా మక్కా ప్రాంతంలోని అనేక ప్రాంతాలలో రాబోయే రెండు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని జాతీయ వాతావరణ కేంద్రం అలెర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో, పౌర రక్షణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, భద్రతా సూచనలను పాటించాలని, వరదలకు గురయ్యే ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరారు.

అదే విధంగా  మదీనా, అల్-ఖాసిమ్, హైల్, అల్-జౌఫ్, ఉత్తర సరిహద్దులతోపాటు తూర్పు ప్రావిన్స్‌లోని ఉత్తర ప్రాంతాలలో కూడా భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని కేంద్రం అంచనా వేసింది. ఈ పరిస్థితులు ఆకస్మిక వరదలకు దారితీయవచ్చని సూచించింది. రియాద్, మక్కా, అల్-బహా, అసిర్, జాజాన్ లోని కొన్ని ప్రాంతాలలో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com