బహ్రెయిన్ లో కార్మిక తీర్పులు అమలుపై మంత్రి క్లారిటీ..!!

- April 05, 2025 , by Maagulf
బహ్రెయిన్ లో కార్మిక తీర్పులు అమలుపై మంత్రి క్లారిటీ..!!

బహ్రెయిన్: కార్మిక న్యాయస్థాన తీర్పులు కేవలం ఒక పని దినంలో అమలు అవుతున్నాయని న్యాయ మంత్రి నవాఫ్ అల్ మావ్దా అన్నారు. ప్రస్తుత శాసనసభ కాలపరిమితి డిసెంబర్ 2022లో ప్రారంభమైనప్పటి నుండి 5,800 కంటే ఎక్కువ కేసులు వ్యవస్థ ద్వారా ఆమోదించబడ్డాయని పేర్కొన్నారు. ఈ మేరకు MP బాస్మా ముబారక్‌ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.

2022 డిసెంబర్ 12 నుండి ఈ సంవత్సరం ఫిబ్రవరి 5 మధ్య మొత్తం 5,849 కార్మిక సంబంధిత కేసులు దాఖలు అయ్యాయని మంత్రి తెలిపారు. వాటిలో 4,924 తుది తీర్పులు రాగా, ఇంకా 925 కోర్టుల ముందు ఉన్నాయని తెలిపారు. సగటున కేసును మూడు నెలల్లోనే పరిష్కరించామని ఆయన అన్నారు.  బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం, అందుబాటులో ఉన్న నిధులను స్వాధీనం చేసుకోవడం, రియల్ ఎస్టేట్, వాటాలు లేదా వ్యక్తిగత ఆస్తిని గుర్తించడం వంటి ఆదేశాలు కోర్టులు తీసుకుంటాయని వెల్లడించారు. అయితే, దాదాపు 85 శాతం అమలు అభ్యర్థనలను కోర్టులు ఒక పని దినంలోపు ఆమోదించాయని మంత్రి తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com