దోహాలో డిస్నీ ‘ది మ్యాజిక్ బాక్స్’ ప్రీమియర్..12వ ప్రదర్శనలు..!!
- April 05, 2025
దోహా: డిస్నీ 75కి పైగా ఫేమస్ పాటలను కలిగి ఉన్న ‘ది మ్యాజిక్ బాక్స్’ ఖతార్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (QNCC)లోని అల్ మయాస్సా థియేటర్‌లో ప్రారంభమైంది. ఏప్రిల్ 12 వరకు జరిగే ఈ సంగీత ప్రదర్శన జరుగుతుంది. ఆకట్టుకునే విజువల్ ఎఫెక్ట్‌ల ద్వారా ప్రాణం పోసుకున్న ఈ ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఈ ప్రదర్శన 90 నిమిషాల పాటు ఉంటుంది. ది మ్యాజిక్ బాక్స్ వంటి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నిర్మాణాలను నిర్వహించడం ద్వారా, విజిట్ ఖతార్ అసాధారణమైన సాంస్కృతిక, కుటుంబ-ఆధారిత అనుభవాలకు అగ్ర గమ్యస్థానంగా దోహా ఖ్యాతిని పెంచుతోందని డిస్నీ ది మ్యాజిక్ బాక్స్ సృజనాత్మక నిర్మాత, సహ రచయిత ఫెలిపే గంబా పరేడెస్ తెలిపారు. 2024 జనవరిలో అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్‌లో ప్రారంభమైన ఈ పర్యటన.. దోహాలో ఐదవ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనను చూడాలనుకునే అభిమానులు వర్జిన్ మెగాస్టోర్ లేదా ఫీవర్ ద్వారా QR85 చెల్లించి టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







