రక్షణ సహకారంపై సౌదీ, అమెరికా మధ్య చర్చలు..!!
- April 05, 2025
రియాద్: సౌదీ అరేబియా, అమెరికా మధ్య సైనిక, రక్షణ సహకారం పెరగనుంది. ఈ మేరకు చర్చించడానికి జనరల్ స్టాఫ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫయాద్ అల్-రువైలి రియాద్‌లో యుఎస్ సెంట్రల్ కమాండ్ కమాండర్ జనరల్ మైఖేల్ కురిల్లాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు మిత్రదేశాల మధ్య కొనసాగుతున్న రక్షణ సమన్వయంలో భాగంగా ఈ సమావేశం జరిగింది.
సౌదీ అరేబియాకు ప్రెసిషన్-గైడెడ్ ఆయుధ వ్యవస్థలను విక్రయించడానికి సంబంధించి ఆయుధ ఒప్పందాన్ని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఇటీవల ఆమోదించింది. గత నెలలో సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ వాషింగ్టన్ డి.సి.ని సందర్శించారు. అక్కడ ఆయన ద్వైపాక్షిక చర్చల కోసం యుఎస్ రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్తో సమావేశమయ్యారు.
అమెరికా-సౌదీ వ్యూహాత్మక భాగస్వామ్యం బలాన్ని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. రక్షణ రంగంలో సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కొత్త అవకాశాలపై ఫోకస్ చేశారు. శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించడానికి ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రయత్నాలపై ఇరువురు సమీక్షలు నిర్వహించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు