దుబాయ్ లో ఖైదీలకు Dh7.6 మిలియన్ల ఆర్థిక సహాయం..!!

- April 06, 2025 , by Maagulf
దుబాయ్ లో ఖైదీలకు Dh7.6 మిలియన్ల ఆర్థిక సహాయం..!!

దుబాయ్: ఖైదీల శ్రేయస్సుకు మద్దతు ఇవ్వడానికి కొనసాగుతున్న నిబద్ధతలో భాగంగా, 2024లో పురుష, స్త్రీ ఖైదీలకు Dh7.6 మిలియన్ల విలువైన మానవతా సహాయం అందించినట్లు దుబాయ్ పోలీసులు ప్రకటించారు. డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ మేజర్ జనరల్ మర్వాన్ అబ్దుల్ కరీం జుల్ఫర్ మాట్లాడుతూ.. ఈ చొరవ దుబాయ్ పోలీసుల విస్తృత సంస్కరణ,  పునరావాస వ్యూహాన్ని తెలియజేస్తుందన్నారు. ఈ విధానం ఖైదీలు తమ జీవితాలను పునర్నిర్మించడంలో సహాయపడటం, సమాజంలో తిరిగి కలిసిపోవడానికి వారిని సిద్ధం చేస్తుందన్నారు. తమ ప్రయత్నాలకు నిరంతరం మద్దతు ఇచ్చే పౌర సమాజ సంస్థలు, ప్రైవేట్ రంగ భాగస్వాములు, వ్యక్తిగత దాతలను ఆయన ప్రశంసించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com