ఒమన్ లో గోల్డ్ బిజినెస్.. గణనీయమైన వృద్ధి..!!
- April 06, 2025
మస్కట్: ఒమన్ లో బంగారు వ్యాపారం గణనీయమైన వృద్ధితో దూసుకుపోతుంది. నవంబర్ 2024 చివరి నాటికి దిగుమతులు, ఎగుమతులు పునఃఎగుమతుల పెరుగుదల ద్వారా గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. ఒమన్ బంగారం దిగుమతులు 372 మిలియన్లకు చేరుకున్నాయి. ఇది 2023లో ఇదే కాలంలో OMR316.9 మిలియన్లతో పోలిస్తే 17.4% పెరుగుదలను నమోదు చేసింది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) వెల్లడించింది. ఇదే సమయంలో దిగుమతి చేసుకున్న బంగారం మొత్తం బరువు కూడా 15,439 కిలోగ్రాములకు పెరిగిందని, ఇది గత సంవత్సరం 14,358 కిలోగ్రాములుగా ఉందని పేర్కొంది.
ఒమన్‌కు బంగారం ఎగుమతి చేసే దేశాల జాబితాలో యూఏఈ అగ్రస్థానంలో ఉంది. మొత్తం దిగుమతుల్లో 92.1% వాటాతో, దీని విలువ OMR342.7 మిలియన్లుగా ఉంది. యెమెన్ OMR11.3 మిలియన్లు, సూడాన్ OMR6.4 మిలియన్లు, హాంకాంగ్ OMR3.2 మిలియన్లు, యునైటెడ్ స్టేట్స్ OMR1.7 మిలియన్లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఎగుమతి విషయానికి వస్తే.. ఒమన్ బంగారం ఎగుమతులు 77.7% పెరిగి నవంబర్ 2024 నాటికి OMR63.2 మిలియన్లకు చేరుకున్నాయి. ఇది 2023లో OMR35.6 మిలియన్లు. ఎగుమతి చేయబడిన బంగారం బరువు కూడా 2,198 కిలోగ్రాములకు పెరిగింది. ఇది గత సంవత్సరం 1,526 కిలోగ్రాములు. మొత్తం ఎగుమతుల్లో 67.2% వాటాతో యూఏఈ ఒమన్ బంగారాన్ని అత్యధికంగా దిగుమతి చేసుకుంటూ, యునైటెడ్ స్టేట్స్, ఇండియా, బహ్రెయిన్, హాంకాంగ్, ఇరాక్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







