తొలి వర్టికల్ లిఫ్ట్ ఫ్రీ పంబన్ రైల్వే బిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ
- April 06, 2025
చెన్నై: పంబన్ కొత్త రైల్వే బ్రిడ్జి భారత దేశ అభివృద్ధి యాత్రలో ఒక మైలు రాయి అని ప్రధాని మోదీ అన్నారు.₹535 కోట్లతో కొత్తగా నిర్మించిన పంబన్ రైల్వే బిడ్జిని ఆదివారం ప్రారంభించి.. జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వంతెన రామేశ్వరం యాత్రికులకు, స్థానిక ప్రజలకు మెరుగైన కనెక్టివిటీని అందిస్తుందన్నారు. ఈ ప్రాంతంలో పర్యాటకం, వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. శ్రీలంక పర్యటన ముగించుకుని నేరుగా తమిళనాడు చేరుకున్న ప్రధాని చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టారు.
తమిళనాడులోని రామేశ్వరంలో భారతదేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జి అయిన పంబన్ రైల్వే బ్రిడ్జి. ఈ బ్రిడ్జి నిర్మాణం ఒక చారిత్రాత్మక ఘట్టం. ఈ వంతెన పొడవు 2.5 కిలోమీటర్లు. ఇది రామేశ్వరం ద్వీపాన్ని భారత ప్రధాన భూభాగంతో అనుసంధానం చేస్తుంది. ఈ కొత్త వంతెన వల్ల రైలు ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధికి కూడా దోహదపడనుంది. ఈ కొత్త వంతెన 1914లో నిర్మించిన పాత పంబన్ బ్రిడ్జికి బదులుగా ప్రత్యామ్నాయంగా నిర్మించారు. కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, తమిళనాడు ప్రభుత్వ ప్రతినిధులు, రైల్వే అధికారులు. బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక







