చైనా 'రివర్స్ టారిఫ్' తో అమెరికా ఉక్కిరిబిక్కిరి!
- April 06, 2025
వాషింగ్టన్: బీజింగ్ మధ్య మరోసారి ఆర్థిక యుద్ధం మోగింది. "నువ్వు నాలుగు కొడితే నేను ఒక్కటి కొట్టలేనా?" అన్నట్లు, అమెరికా విధించిన ప్రతీకార సుంకాలకు చైనా ధీటుగా ప్రతిస్పందించింది. ఈసారి మాటల్లో కాదు… అత్యవసరమైన ఖనిజాలపై నిషేధాలతో! దీంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ గుండె గుబుసుకోడం మొదలైంది. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, "చైనా అన్యాయంగా వ్యవహరిస్తోంది" అంటూ 34 శాతం అదనపు సుంకాలను విధించడానికి సిద్ధమయ్యాడు. ఏప్రిల్ 10 నుండి అమల్లోకి రానున్న ఈ విధానానికి చైనా కూడా అలాగే 34 శాతం రివర్స్ టారిఫ్ విధించేసింది. అంతే కాదు, అంతకంటే ముందే – ఏప్రిల్ 4 నుంచే అమలు చేస్తూ ఖనిజ ఎగుమతులపై కఠిన ఆంక్షలు విధించింది. అమెరికాకు షాక్ చైనా ఎగుమతి చేసే సమారియం, గాడోలినియం, డైస్పోరియం, లుటేటియం, స్కాండియం, ఇత్రియం లాంటి అరుదైన భూకనిజాలపై ఎంబార్గో విధించడంతో… అమెరికాలో రక్షణ, స్మార్ట్ఫోన్, కంప్యూటర్ పరిశ్రమలు హడలెత్తిపోయాయి. ఎందుకంటే ఈ విభాగాలన్నీ ఈ ఖనిజాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. అంతేకాదు, 16 అమెరికన్ కంపెనీలకు చైనా పూర్తిగా డ్యూయల్-యూజ్ వస్తువుల ఎగుమతిని నిలిపివేసింది. దీన్ని చైనా “వ్యవహార మార్గదర్శక ప్రతీకారం” అని పేర్కొనగా, అమెరికా మాత్రం దీన్ని “వాణిజ్య దుర్వినియోగం”గా అభివర్ణిస్తోంది. ట్రంప్ స్పందన సోషల్ మీడియా వేదికగా ట్రంప్, “చైనా మా దెబ్బకు గాబరా పడిపోయింది… వాళ్ల చర్యలు తుత్తికట్టిన ప్రయత్నం మాత్రమే” అని వ్యాఖ్యానించినా, చైనా స్పందన తీవ్రంగా ఉంటుందని ట్రంప్ ఊహించలేదన్న వాదన బలపడుతోంది. చైనాది నిశ్శబ్ద ప్రతీకారం…ఒకటే దెబ్బలో అమెరికా కీలక పరిశ్రమలను వణికించింది.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







