సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక నిర్ణయం
- April 07, 2025
సౌదీ అరేబియా ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది హజ్ యాత్ర సమీపిస్తున్న తరుణంలో భారత్ సహా 14 దేశాలకు వీసాల జారీని నిషేధిస్తూ సౌదీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఇలా సౌదీ అరేబియా ప్రభుత్వం వీసాలు నిషేధించిన దేశాల జాబితాలో భారత్ తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలు కూడా ఉన్నాయి. ఈ నిషేధం కారణంగా ఆయా దేశాల పౌరులు తిరిగి ఆదేశాలు వచ్చే వరకూ వీసాల కోసం ఎదురు చుడాలిసిందే. సౌదీ అరేబియా ఇలా వీసాలు నిషేధించిన జాబితాలో భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాక్, నైజీరియా, జోర్డాన్, అల్జీరియా, సూడాన్, ఇథియోపియా, ట్యునీషియా, యెమెన్ , మొరాకోతో ఉన్నాయి. సరైన రిజిస్ట్రేషన్ లేకుండా హజ్ యాత్ర చేయడానికి ప్రయత్నించే వ్యక్తులను నిరోధించడానికి ఈ చర్య తీసుకున్నట్లు సౌదీ ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఉమ్రా వీసాలు కలిగి ఉన్న వ్యక్తులు మాత్రం ఏప్రిల్ 13 వరకు సౌదీ అరేబియాలోకి ప్రవేశించేందుకు వెసులుబాటు కల్పించారు.
సౌదీ అరేబియా ఇలా వీసాలు నిషేధించిన జాబితాలో భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాక్, నైజీరియా, జోర్డాన్, అల్జీరియా, సూడాన్, ఇథియోపియా, ట్యునీషియా, యెమెన్ , మొరాకోతో ఉన్నాయి. సరైన రిజిస్ట్రేషన్ లేకుండా హజ్ యాత్ర చేయడానికి ప్రయత్నించే వ్యక్తులను నిరోధించడానికి ఈ చర్య తీసుకున్నట్లు సౌదీ ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
గతేడాది చాలా మంది విదేశీయులు ఉమ్రా లేదా విజిట్ వీసాలపై సౌదీ అరేబియాలోకి ప్రవేశించి అధికారిక అనుమతి లేకుండా హజ్లో పాల్గొనడానికి చట్టవిరుద్ధంగా అక్కడే ఉండిపోయారు. దీంతో భారీగా రద్దీ తలెత్తి తీవ్రమైన వేడి వాతావరణం కూడా ఏర్పడి 1200 మందికి పైగా చనిపోయారు. ఈ నేపథ్యంలో మరోసారి అలాంటి సమస్యలు తలెత్తకుండా సౌదీ అరేబియా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఇలా వీసాల జారీ నిలిపేసినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







