రాస్ అల్ ఖైమాలో విషాదం..నీటి బకెట్లో మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- April 07, 2025
యూఏఈ: గత శుక్రవారం పాత రాస్ అల్ ఖైమాలోని సిద్రోహ్ పరిసరాల్లో విషాధం చోటుచేసుకుంది. ఇంట్లో నీటితో నిండిన బకెట్లో మునిగి రెండేళ్ల బాలుడు విషాదకరంగా ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు నలుగురు తోబుట్టువులలో చిన్నవాడు. పాకిస్తాన్ సంతతి బాలుడైన అబ్దుల్లా మొహమ్మద్ మొహమ్మద్ అలీని కుటుంబసభ్యులు రస్ అల్ ఖైమాలోని సఖ్ర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి చేరుకునే లోపే అతను మరణించినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. అబ్దుల్లా ఇంట్లో ఆడుకుంటూ వంటగదిలోకి వచ్చి అక్కడే ఉన్న నీటితో నిండిన బకెట్లో పడి చనిపోయాడని, ఆ సమయంలో అతని తండ్రి శుక్రవారం ప్రార్థనల కోసం వెళ్లాడని పోలీసులు తెలిపారు. తన భార్య బట్టలు ఉతకడానికి ఉపయోగించిన తర్వాత బకెట్ను సాధారణంగా మూసేస్తారని, కానీ ఒకసారి దానిని మర్చిపోవడంతో తమ కుటుంబంలో తీరని విషాదం నింపిందని ఆ బిడ్డ తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







